కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చిన ట్రంప్‌.. వీడియో ఇదిగో

kcr meets trump
  • విందుకు హాజరైన ప్రతినిధులను ట్రంప్ కు పరిచయం చేసిన కోవింద్
  • కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు విందుకు హాజరు
  • త్రివిద దళాధిపతులు, పలువురు ఉన్నతాధికారులు కూడా  
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ విందు ఇస్తున్నారు. ఈ క్రమంలో విందుకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ట్రంప్‌ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. సూటు బూటు వేసుకుని ఈ విందుకు కేసీఆర్‌ హాజరయ్యారు.  
                  
ఈ విందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. విందుకు హాజరైన ప్రతినిధులను ట్రంప్ దంపతులకు రామ్‌నాథ్‌ కోవింద్ పరిచయం చేశారు. త్రివిద దళాధిపతులు, పలువురు ఉన్నతాధికారులు కూడా విందుకు వచ్చారు. అమెరికా బృందాన్ని రాష్ట్రపతి కోవింద్‌కు ట్రంప్ పరిచయం చేశారు.
Go Back to Shorts
KCR
Telangana
Donald Trump

More Telugu News