ఢిల్లీలో కొనసాగుతున్న సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు
- ఈశాన్య ఢిల్లీలో నిన్న మొదలైన ఆందోళనలు
- ఈరోజు తెల్లవారు జాము వరకు అదే పరిస్థితి
- మౌజ్ పూర్, బ్రహ్మపురి ప్రాంతాల్లో రాళ్లు రువ్విన ఆందోళనకారులు
ఇవాళ ఉదయం మౌజ్ పూర్, బ్రహ్మపురి ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్విన సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 150 మందికి పైగా గాయపడ్డారు. కాగా, ఈశాన్య ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
మరోపక్క, ఈ ఘటనపై హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్, ఈశాన్య ఢిల్లీ ప్రాంత అధికారులు, ఎమ్మెల్యేలతో అమిత్ షా అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.