రాష్ట్రపతి ప్రత్యేక విందుకు మాజీ ప్రధాని మన్మోహన్​ దూరం!

 Manmohan singh avoids Rasrapati special Dinner
  • యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి విందు
  • ఆహ్వానం అందినప్పటికీ విందుకు రానని చెప్పిన మన్మోహన్
  • సోనియాను ఆహ్వానించకపోవడమే కారణమట
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విందులో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానం పొందిన వారి జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు.

అయితే, ఆ విందుకు ఆయన హాజరుకావట్లేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి మన్మోహన్ సమాచారం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని మన్మోహన్ చెప్పినట్టు సమాచారం. కానీ, అసలు కారణం అది కాదని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను ఈ విందుకు ఆహ్వానించకపోవడం వల్లే మన్మోహన్ వెళ్లడం లేదని తెలుస్తోంది. మన్మోహనే కాదు ఆహ్వానం అందుకున్న కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ కూడా విందుకు వెళ్లడం లేదని సమాచారం.
Go Back to Shorts
Manmohan singh
ex-prime minister
Rastrapathi special dinner

More Telugu News