వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలన్న కేసులో తీర్పు రిజర్వ్
- వైఎస్ వివేకా హత్య కేసుపై ముగిసిన విచారణ
- పోస్టుమార్టమ్ నివేదిక, కేసు డైరీని కోర్టుకు సమర్పించిన పోలీసులు
- సీబీఐ విచారణ అవసరం లేదన్న ప్రభుత్వ న్యాయవాది
వివేకా హత్య కేసులో విచారణ ముగింపు దశకు చేరుకుందని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న తమ అభిప్రాయాన్ని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన సిట్ దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచింది.