Bellamkonda Srinivas: బెల్లంకొండ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తాడట

Santhosh Srinivas Movie
షార్ట్స్‌లో చూడండి
బెల్లకొండ శ్రీనివాస్ కి మాస్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఇక యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకునే కథలను ఎంచుకోవడానికి ఆయన ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. ఈ సినిమా 'కందిరీగ' మాదిరిగానే నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తుందని అంటున్నారు.

'కందిరీగ'లో రామ్ మాదిరిగానే ఈ సినిమాలో బెల్లంకొండ పాత్ర పూర్తి ఎనర్జిటిక్ గా వుంటుందట. ఆ సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలోను ఇద్దరు కథానాయికలు వున్నారు. నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ పాత్రలు అదే తరహాలో సందడి చేస్తాయట. ఇక 'కందిరీగ'లో విలన్ గా చేసిన సోనూ సూద్, ఈ సినిమాలోనూ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారట. యాక్షన్ సీన్స్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలవనున్నాయని అంటున్నారు. మొత్తానికి బెల్లంకొండను సంతోష్ శ్రీనివాస్ కొత్తగా చూపించనున్నాడన్న మాట.
Go Back to Shorts
Bellamkonda Srinivas
Nabha Natesh
Anu Emmanuel
Santhosh Srinivas Movie

More Telugu News