రాకెట్లా దూసుకెళ్తున్న పుత్తడి ధర.. రూ. 45 వేల దిశగా పరుగులు!
- రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
- హైదరాబాద్ మార్కెట్లో రూ. 44,430కి చేరిక
- గత వారం రోజుల్లోనే రూ.1790 పెరుగుదల
24 కేరెట్ల బంగారం ధర హైదరాబాద్‌లో గత వారం రోజుల్లోనే రూ. 1790 పెరగడం గమనార్హం. ఈ నెల 17న మార్కెట్లో రూ.42,640 ధర పలకగా నిన్న రూ.44,430కి చేరింది. ఇక 22 కేరెట్ బంగారం ధర రూ.1580 పెరిగింది. కోవిడ్-19 కారణంగా మదుపర్లు బంగారం వైపు మళ్లడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ వంటివి ధర పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.