నిన్నటి మందడం ఘటనలో నిందితులను అరెస్టు చేశాం: తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
- రైతులు రోడ్డుపై ధర్నా చేస్తుండటం వల్లే డ్రోన్ తో చిత్రీకరించాం
- ఓ మహిళ స్నానం చేస్తుండగా చిత్రీకరించారన్నది అబద్ధం
- హోం మంత్రి, డీజీపీ కాన్వాయ్ లను, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న నిందితులను అరెస్టు చేశాం
హోం మంత్రి సుచరిత, డీజీపీ కాన్వాయ్ లు వెళ్తుండగా రైతులు తమ ట్రాక్టర్ లు అడ్డుపెట్టారని, ఈ ఘటనలో నిందితులు సహా ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న వారిపైనా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం రైతులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారని అన్నారు.