సుజనా ఆస్తులను వేలానికి ఉంచిన బ్యాంక్ ఆఫ్ ఇండియా!
- బ్యాంకుకు రూ. 400 కోట్ల బకాయిలు
- ఆన్ లైన్ విధానంలో ఆస్తుల వేలం
- ప్రకటించిన బ్యాంకు చెన్నై శాఖ
2018 అక్టోబరు నాటికి సంస్థ నుంచి తమ బ్యాంకుకు రూ. 322 కోట్లు రావాల్సివుందని, ప్రస్తుతం అది వడ్డీలు కలుపుకుంటే రూ. 400 కోట్లకు చేరిందని పేర్కొంది. కాగా, సుజనా యూనివర్సల్ తీసుకున్న రుణాలకు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), వై జితిన్ కుమార్, వై శివరామకృష్ణ, ఎస్‌టీ ప్రసాద్, జీ శ్రీనివాస రాజు, సార్క్ నెట్ లిమిటెడ్, సుజనా క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్, సుజనా పంప్స్ అండ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ స్ల్పెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్, నియోన్ టవర్స్ లిమిటెడ్, గ్యారంటీర్లుగా వ్యవహరించారు.