Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోర్న్ స్టార్ వృత్తిని ఎంచుకున్న ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కుమార్తె

Steven Spielbergs Daughter Mikaela Chooses Career As Porn Star
  • సొంత ప్రొడక్షన్ లో పోర్న్ చిత్రాలు
  • తన తల్లిదండ్రులు అప్సెట్ కాలేదని వ్యాఖ్య
  • తన సేఫ్టీనే వారికి ముఖ్యమని చెప్పిన మికేలా 
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కుమార్తె మికేలా (23) సంచలన నిర్ణయం తీసుకుంది. పోర్న్ చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకుంది. ది సన్ అనే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారానే ఈ చిత్రాలను నిర్మిస్తానని ఆమె తెలిపింది.

మికేలాను 1996లో స్పీల్ బర్గ్ దంపతులు దత్తత తీసుకున్నారు. మరోవైపు పోర్న్ స్టార్ కావాలనుకుంటున్న తమ కుమార్తె నిర్ణయాన్ని స్పీల్ బర్గ్ దంపతులు స్వాగతించారని 'ది సన్' తెలిపింది.

తన తల్లిదండ్రుల గురించి మికేలా మాట్లాడుతూ, తన సేఫ్టీనే వారికి చాలా ముఖ్యమని తెలిపింది. తాను ఎంచుకున్న వృత్తి పట్ల వారు అప్సెట్ కాలేదని చెప్పింది.
Steven Spielberg
Daughter
Mikaela
Porn Films
Adult Movies

More Telugu News