మరి చంద్రబాబుపై మీ కడుపు మంట అదేగా!: ఏపీ సీఎంకు నారా లోకేశ్ కౌంటర్
- ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తిచేయరాదని కంకణం కట్టుకున్నారు
- అందుకే ఆ దిశగా మోకాలడ్డుతున్నారు
- మీ కడుపు మంటకూ మందు లేదు
నిన్న కర్నూలులో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ మూడో విడత కార్యక్రమం ప్రారంభోత్సవంలో చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ప్రజల కోసం నేను నిజాయతీగా ఎన్ని మంచి పనులు చేసినా చంద్రబాబుకు విమర్శించడం తప్ప మరో పనిలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు లోకేశ్ ట్విట్టర్ వేదికగా సమాధానమిచ్చారు.