'చనిపోతున్నాం... వెతకొద్దు'... అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మెసేజ్ తో విశాఖలో కలకలం!
- సోమవారం సాయంత్రం అదృశ్యమైన అమ్మాయిలు
- నిన్న చెన్నైలో ఉన్నట్టు మెసేజ్
- క్షేమంగా ఇంటికి చేరుస్తామంటున్న పోలీసులు
సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన వీరు అదే సమయంలో తల్లికి మెసేజ్ చేశారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, వారిని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రాక్ చేశారు. ఇంతలో నిన్న తాము చెన్నై చేరుకున్నామని, ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నామని వారి నుంచి మెసేజ్ వచ్చింది. దీంతో అమ్మాయిల తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వారు చెన్నై ఎందుకు వెళ్లారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. బాలికలను క్షేమంగా ఇల్లు చేరుస్తామని తెలిపారు.