సీఏఏపై మీ వైఖరేంటో చెప్పి గందరగోళం తొలగించండి: నవీన్ పట్నాయక్‌ను నిలదీసిన కాంగ్రెస్
- బీజేడీ కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతోంది
- అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలను గుర్తు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సలుజా
- ఈ నెల 28 నుంచి ఒడిశాలో సీఏఏ అనుకూల సభలు
బీజేడీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో సీఏఏకు మద్దతు ఇచ్చారన్న సలుజా.. డిసెంబరులో భువనేశ్వర్‌లో మైనారిటీ వర్గాల నేతలతో జరిగిన సమావేశంలో మాత్రం సీఏఏకు తాము వ్యతిరేకమని సీఎం నవీన్ పట్నాయక్ చెప్పారని గుర్తు చేశారు. కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. కాబట్టి సీఎం ఇప్పటికైనా తమ వైఖరేంటో స్పష్టం చేసి ఆ గందరగోళానికి తెరదించాలని సలుజా డిమాండ్ చేశారు.