Rashmika Mandanna: ఫ్యాన్స్ చూపిన అభిమానానికి ఉబ్బితబ్బిబ్బవుతున్న రష్మిక!

Rashmika Special Thanks to Fans
  • రష్మిక 10వ చిత్రంగా 'భీష్మ'
  • ఈ నెల 26న విడుదలకు సిద్ధం
  • ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు తెలిపిన అందాల భామ

"ఓ మై గాడ్... అప్పుడే పది సినిమాలా? నాకు ఇంకా కొత్తగానే ఉంది. మీ అందరి మద్దతే నన్ను ఈ స్టేజ్ కి తీసుకుని వచ్చింది. విభిన్నమైన, మంచి పాత్రల్లో నటించినందుకు కాదుగానీ, మీ అందరి అభిమానాన్ని పొందినందుకు నేను పండగ చేసుకుంటాను. లవ్ యూ ఆల్" అంటూ... ఫ్యాన్స్ తనపై చూపిస్తున్న అభిమానానికి అందాల నటి రష్మిక మందన్న ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఆమె నటించిన 10వ చిత్రం 'బీష్మ' 21న విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ట్విట్టర్ వేదికగా ఓ హ్యాష్ ట్యాగ్ ను 'రష్మిక 10 ఆన్ ఫిబ్ 21' పేరుతో సృష్టించారు. ఇక ఈ హ్యాష్ ట్యాగ్ పలు రకాల రష్మిక చిత్రాలు, ట్వీట్లు, అభినందనలు, ప్రశంసలతో నిండిపోయింది. వీటన్నింటినీ చూసిన రష్మిక, ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఈ ట్వీట్ పెట్టింది.

  • Loading...

More Telugu News