పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి ఘటన: హత్యా? ప్రమాదమా? పలు అనుమానాలు!
- మృతుల కాల్ డేటాను పరిశీలిస్తున్న పోలీసులు
- అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేస్తున్నాం
- వారి బిడ్డ ఆచూకీ కోసం గాలింపు
ఇదిలావుండగా, వీరు 22 రోజుల క్రితమే ఇంటి నుంచి వెళ్లారన్న మరో వాదన తాజాగా తెరపైకి వచ్చింది. నిన్న కాలువ ఒడ్డుపై వెళుతున్న మరో దంపతుల బైక్ అదుపు తప్పి కాలువలోకి జారిపోగా, వారి జాడ కోసం అధికారులు నీటి విడుదలను ఆపివేయడంతో, ఈ కారు బయట పడింది. సత్యనారాయణ రెడ్డి, రాధ, వారి కుమార్తె వినయశ్రీలు కనిపించకుండా పోవడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకోలేదన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.