ఒవైసీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు:బీజేపీ నేత లక్ష్మణ్
- భైంసాలో అల్లర్లకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
- భద్రత కల్పించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యవహరించారు
- మజ్లిస్ పార్టీ ఆగడాలను అరికట్టాలి
హైదరాబాద్ లో తాము అనుభవించిన బాధలు ఈరోజున భైంసాలో ప్రజలు అనుభవిస్తున్నారని అన్నారు. ఎంఐఎం అధినేత ఒవైసీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీఆర్ఎస్ కూ పడుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేశారు.