ఐతే ఏమైంది.. పక్కన నాలుగు సున్నాలు పెడితే పోలా అని జగన్ ఆదేశించారు: బుద్ధా వెంకన్న
- ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో సోదాలపై వచ్చిన వార్తలపై బుద్ధా ఫైర్
- 2 వేల కోట్లు అంటూ సాక్షిలో వార్తలు
- ఉన్నది 2 లక్షల 63 వేలు,12 తులాల బంగారం
- విజయసాయిరెడ్డి నాలుగు సున్నాలు తగిలించారు
'2 వేల కోట్లు అంటూ సాక్షి సిత్రాలు, వైకాపా నాయకులు ఆడుతోన్న డ్రామాలు పటాపంచలు అయ్యాయి. ఉన్నది 2 లక్షల 63 వేలు,12 తులాల బంగారం. అంత సొమ్ము మాకొద్దు అని తిరిగి ఇచ్చేశారు కూడా' అని తెలిపారు.
'అయితే ఏమైంది.. పక్కన నాలుగు సున్నాలు పెడితే పోలా.. అని జగన్ గారు ఆదేశించారు. సున్నాలు పెట్టి జగన్ గారిని ముంచడంలో నిష్ణాతుడు అయిన విజయసాయిరెడ్డి నాలుగు సున్నాలు తగిలించి 2 వేల కోట్లు అని మొరిగి మరోసారి వైకాపా దొంగల ముఠాని ముంచేశారు' అని ఎద్దేవా చేశారు.