కాళేశ్వరంలో మహాఘట్టం ఆవిష్కృతం!
- ఒకేసారి 11 మోటార్లను ఆన్ చేసిన అధికారులు
- మేడిగడ్డ నుంచి అన్నారంకు గోదారమ్మ పరుగులు
- ఒక్కరోజులో 2 టీఎంసీల నీటి ఎత్తిపోత
ఇక మేడిగడ్డ నుంచి పరుగులు పెట్టిన గోదారమ్మ, కొన్ని గంటల వ్యవధిలోనే అన్నారం బ్యారేజ్ కి చేరుకుంది. ఇప్పటికే అన్నారంకు 2 టీఎంసీలకు పైగా నీరు చేరిందని అధికారులు వెల్లడించారు. అన్ని మోటార్లనూ ఆన్ చేస్తే, ఒక్క రోజులోనే నాలుగు టీఎంసీల నీటిని తరలించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇంత భారీ మొత్తంలో నీటిని విజయవంతంగా విడుదల చేసిన అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.