మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో ప్రారంభమైన లుకలుకలు.. థాకరే తీరుపై శరద్ పవార్ అసంతృప్తి
- ఎల్గార్ పరిషత్ కేసును ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి థాకరే ఆమోదముద్ర
- రాష్ట్ర పరిధిలోకి కేంద్రం చొచ్చుకురావడం దారుణమన్న శరద్ పవార్
శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని... ఆ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం చొచ్చుకురావడం దారుణమని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శరద్ పవార్ తన అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.