తన కారుపై దాడి జరిగిందంటూ కత్తి మహేశ్ ఫిర్యాదు
- ఐమాక్స్ సినిమా చూసి వస్తుండగా దాడి
- ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైఫాబాద్ పోలీసులు
- రాముడిపై కత్తి వ్యాఖ్యల కారణంగానే దాడి చేశామన్న వ్యక్తులు!
ఈ దాడిలో కత్తి మహేశ్ కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. కత్తి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలుగా భావిస్తున్నారు. రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేసినట్టు సదరు వ్యక్తులు చెప్పినట్టు సమాచారం.