నెలాఖరులో ఇండియాకు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
- 24 నుంచి 26వ తేదీ మధ్య పర్యటిస్తారన్న మైక్రోసాఫ్ట్
- అదే తేదీల్లో రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- ఆసక్తిగా మారిన ప్రముఖుల పర్యటనలు
ఇండియాలో మైక్రోసాఫ్ట్ వినియోగదారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో సత్య నాదెళ్ల మాట్లాడుతారని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని మైక్రోసాఫ్ట్ సంస్థ తెలిపింది. ఆయన ఏయే నగరాలకు వెళతారన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయన ఢిల్లీ, ముంబై, బెంగళూరు సిటీల్లో పర్యటిస్తారని, కొందరు ప్రభుత్వ నేతలు, అధికారులతో సమావేశం అవుతారని మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి.