Galla Jayadev: ఏపీ మరోసారి చిన్నచూపుకు గురైంది: గల్లా జయదేవ్
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ మలివిడత ప్రసంగంలోనూ ఏపీ కోసం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం బాధాకరమని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాల దిశగా బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని ఆరోపించారు. కనీసం ప్రస్తావనలు కూడా తీసుకురాలేదని వాపోయారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా అనేకమంది ఈ అంశాన్ని ఎత్తిచూపినా, ఏపీ మరోసారి చిన్నచూపుకు గురైందని వ్యాఖ్యానించారు.