14 ఏళ్ల అమ్మాయితో బాలుడు టిక్‌టాక్.. ఎందుకు చేశావంటూ నగ్నంగా ఊరేగించిన వైనం
- జైపూర్‌లో ఘటన
- బాలుడిని కొట్టిన బాలిక తండ్రి, సోదరుడు
- వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి ఘటన
తన స్నేహితురాలైన బాలికతో ఆ బాలుడు చేసిన టిక్‌టాక్‌ను బాలిక సోదరుడు చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఈ విషయాన్ని తన తండ్రికి కూడా చెప్పాడు. ఇద్దరూ కలిసి బాలుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు దీంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు కూడా ఆ బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.