బీజేపీకి ఉపశమనం... ఢిల్లీలో ఓడినా బలం పెంచుకుంటున్న కాషాయ దళం !
- గత ఎన్నికలతో పోల్చితే ఐదారు రెట్లు ఎక్కువ స్థానాలు
- చివరి వరకు ఆధిక్యం నిలబడితే అదో ఘనత
- ఆప్ స్థానాలను కొల్లగొట్టిన కమలనాథులు
మరోవైపు గత ఎన్నికల్లో 67 స్థానాలు సాధించి అప్రతిహత మెజార్టీ సొంతం చేసుకున్న ఆప్ ఈసారి 50 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మరోసారి సామాన్యుడినే కొలువు దీర్చాలని అక్కడి ప్రజలు నిర్ణయం తీసుకున్నా అసెంబ్లీలో తన బలాన్ని అమాంతం ఐదారు రెట్లకు పెంచుకోవడం బీజేపీకి ఎంతోకొంత ఊరటనిచ్చే పరిణామం అంటే అతిశయోక్తి కాదు.