IYR Krishna Rao: జగన్ పై సున్నిత విమర్శలు గుప్పించిన ఐవైఆర్

IYR Krishna Rao comments on CM Jagan
షార్ట్స్‌లో చూడండి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడి నుంచి పనిచేయాలన్నది తన ఇష్టం అని ఏపీ సీఎం చెబుతుండటం ఇది రెండో సారని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో ఇవే వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇతర వ్యవస్థలు కుప్పకూలడానికి ఇలాంటి నిర్ణయాలు దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని కీలక నిర్ణయాలను చీఫ్ సెక్రటరీ సహకారంతో కేబినెట్ తీసుకుంటోందని అన్నారు. ముఖ్యమంత్రి క్రమం తప్పకుండా సెక్రటేరియట్ కు వచ్చి, అక్కడ గడిపితేనే ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉంటుందని చెప్పారు. పాలన అనేది ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయం కాదని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
IYR Krishna Rao
Jagan
YSRCP
KCR
TRS
Secretariat

More Telugu News