ఈ ఫొటో, కామెంట్ చూసి సారా అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ ప్రేమను ఖరారు చేసేస్తున్న నెటిజన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ ఫొటో, కామెంట్ చూసి సారా అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ ప్రేమను ఖరారు చేసేస్తున్న నెటిజన్లు!

The photo tells tha love story of Sara Ali Khan and Karthik Aryan
  • సారాకు భోజనం తినిపించిన కార్తీక్
  • బాగా బరువు పెరగాలని సలహా
  • ఇద్దరి మధ్యా ప్రేమ నిజమేనంటున్న ఫ్యాన్స్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్, నటుడు కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉందని గత కొంత కాలంగా వార్తలు వస్తుండగా, తాజాగా, కార్తీక్ పెట్టిన ఫొటో, క్యాప్షన్ చూసి, వారిద్దరి మధ్యా లవ్ ను కన్ఫార్మ్ చేసేస్తున్నారు నెటిజన్లు. 'లవ్ ఆజ్ కల్ 2' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ, షూటింగ్ సమయంలోనే లవ్ లో పడ్డట్టు తెలుస్తుండగా, ఆపై పలుమార్లు పార్టీల్లో, డిన్నర్లకు కలిసి వెళ్లి కెమెరాకు చిక్కారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సారా, తనకు తొలి ప్రేమపై నమ్మకం ఉందని తెలిపింది. తనది కూడా అటువంటి ప్రేమేనని చెప్పింది. ఇదిలావుంచితే, తాజాగా, సారా నోటికి గోరుముద్దలు తినిపిస్తున్న కార్తీక్ ఆర్యన్ చిత్రం ఒకటి వైరల్ అయింది. దీనికి క్యాప్షన్ గా "నువ్వు చాలా సన్నగా అయిపోయాయి. బాగా తిని మళ్లీ బరువు పెరగాలి" అంటూ కార్తీక్ ఓ క్యాప్షన్ ను పెట్టాడు. ఇక ఈ ఫొటో, క్యాప్షన్ చూసిన వాళ్లంతా వారిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.
Sara Ali Khan
Kartik Aryan
Love
Post
Viral

More Telugu News