డిమాండ్ల పరిష్కారం కోసం.. నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!
- ఆర్టీసీ ఎండీపై మండిపడుతున్న ఈయూ నేతలు
- నేడు 128 డిపోలు, వర్క్‌షాపుల ఎదుట సామూహిక నిరాహార దీక్షలు
- ఉన్న సౌకర్యాలు తొలగిస్తున్నారని ఆరోపణ
ఈయూ నేత దామోదర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఎండీ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టారు. కాంట్రాక్టు డ్రైవర్, కండక్టర్ల నియామకాలను వెనక్కి తీసుకోవాలని, ఎస్ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ ట్రస్ట్‌లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆర్టీసీ రూట్లలో స్కూలు బస్సులను తిప్పుకునేందుకు అనుమతించడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు దామోదర్ తెలిపారు.