పేనుకు పెత్తనమిస్తే తలంతా ఎలా చెడగొడుతుందో అలాగే జరిగింది: దేవినేని ఉమ

ఏపీ సీఎం జగన్ కక్షపూరితంగా పరిపాలిస్తూ అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు తగ్గించారని, భారీగా పెన్షన్ ఖాతాలు తొలగించారని ఆరోపించారు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారని, ఇప్పుడు విద్యుత్ చార్జీలను కూడా పెంచుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై అన్ని రకాల దాడులు పూర్తవడంతో ఇప్పుడు అధికారులపై పడ్డారని వ్యాఖ్యానించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా ఎలా చెడగొడుతుందో, ఏపీలో జగన్ కు అధికారం ఇచ్చిన తర్వాత రాష్ట్రం పరిస్థితి అలాగే తయారైందని విమర్శించారు.
Go Back to Shorts
Devineni Uma
Jagan
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News