‘ఆస్కార్’ పండుగ షురూ.. అవార్డులు కొల్లగొడుతున్న ‘1917’
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘ఆస్కార్’ పండుగ షురూ.. అవార్డులు కొల్లగొడుతున్న ‘1917’

  • ‘1917’కు అవార్డుల పంట
  • ఉత్తమ సహాయనటుడిగా బ్రాడ్‌పిట్
  • ఉత్తమ యామినేటెడ్ ఫీచర్‌గా ‘టాయ్‌స్టోరీ4’
  • ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్‌గా ‘పారాసైట్’
హాలీవుడ్ సినిమా పండుగ ప్రారంభమైంది. లాస్ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ‘ఆస్కార్’ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరుగుతోంది. ‘ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ సినిమాలో అత్యుత్తమ నటనకుగా హాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రాడ్‌పిట్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకోగా, మ్యారేజ్ స్టోరీలో నటనకు గాను లారా డ్రెన్ ఉత్తమ సహాయనటిగా ఎంపికయ్యారు. ఇప్పటి వరకు ప్రకటించిన వాటిలో ‘1917’ సినిమా వివిధ విభాగాల్లో అత్యధిక అవార్డులు కొల్లగొట్టింది.

 ‘టాయ్ స్టోరీ 4’ ఉత్తమ యామినేటెడ్ ఫీచర్ సినిమాగా అవార్డు అందుకుంది. ఇక, బాంబ్‌షెల్‌కు మేకప్ అండ్ హెయిల్ స్టైలింగ్ విభాగంలో ఆస్కార్ రాగా, పారాసైట్ సినిమా ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌గా ఎంపికైంది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కింద ‘1917’ సినిమాకు గాను రోచ్‌రాన్, గ్రెగ్ బట్లర్, డొమినిక్ తువేలకు అవార్డు దక్కగా, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ చిత్రానికి గాను మైఖెల్ మెక్‌సుకర్, ఆండ్రూ బక్‌ల్యాండ్‌లు అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగంలో 1917 సినిమాకు గాను రోజర్ డికెన్స్ ఆస్కార్ అందుకున్నారు. ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ కేటగిరీలో ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ సినిమాకు గాను డొనాల్డ్ సిల్వెస్టర్‌కు అవార్డు దక్కింది. ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో 1917 సినిమాకు గాను మార్క్ టేలర్, స్టువర్ట్ విల్సన్, మ్యారేజ్ స్టోరీలో నటనకు గాను లారా డ్రెన్ ఉత్తమ సహాయనటిగా ఎంపికయ్యారు.
Oscar awards
Parasite
Los Angeles
America
Hollywood

More Telugu News