ఇప్పటికైనా సిగ్గు ఉంటే ఈ పనులు ఆపండి: వైసీపీ ప్రభుత్వానికి బుద్ధా వెంకన్న సూచన
- మీ నాయకుల బెదిరింపులు వల్లే కంపెనీలు బెదిరిపోతున్నాయి
- 'అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతాం ఏపీలో తప్ప' అంటున్నాయి
- ఇప్పటికైనా పరిశ్రమలపై బెదిరింపులు ఆపండి
- యువత భవితపై దెబ్బకొట్టకండి సాయి రెడ్డి గారు
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్ను కూడా మేనేజ్ చేసి కియా కార్ల ఫ్యాక్టరీ తరలిపోతుందంటూ వార్త రాయించి పుకార్లు లేవదీశాడంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.
'మీ మాటలు చూస్తుంటే అధికారంలో ఉన్న జగన్ గారు చేతగాని వాడు అని మీరే రాజముద్ర వేసి మరీ డప్పు కొడుతున్నట్టు ఉంది. చంద్రబాబు గారు జాతీయ మీడియాని మ్యానేజ్ చేశారని ఏడ్చారు. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ మీడియాని కూడా ఆడిస్తున్నారు అని పెడబొబ్బలు పెడుతున్నారు ఏంటీ? విజయసాయిరెడ్డి గారు?' అని బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.