అపారమైన మేధ ఆ యువకుడి సొంతం... మాతృదేశానికే సేవలందిస్తానంటూ నాసా ఆఫర్ తిరస్కరణ
- 19 ఏళ్లకే శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలు
- నాసా, ట్రంప్ ఆహ్వానాలు
- విదేశీ ఆఫర్లను తిరస్కరించిన బీహార్ యువకుడు
అరటితో ప్రయోగాలు, పేపర్ బయోసెల్స్ అంశాల్లో పేటెంట్లు పొందాడు. అహ్మదాబాద్ లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గోపాల్ ను మరింత ప్రోత్సహించింది. దాంతో మరికొన్ని ఆవిష్కరణలను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో గోపాల్ కు నాసా నుంచి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఆహ్వానాలు అందాయి. అయితే మాతృదేశమే మిన్న అని భావించిన ఈ బీహార్ యువకుడు తన సేవలు భారత్ కే అందిస్తానని విదేశీ ఆఫర్లు తిరస్కరించాడు. ప్రస్తుతం గోపాల్ దేశభక్తి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.