మోదీ ప్రసంగం నుంచి ఒక పదాన్ని తొలగించిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు
- మోదీ, అజాద్ ప్రసంగాల్లో ఒక్కో పదాన్ని తొలగించిన వెంకయ్య
- కేంద్ర మంత్రి సుప్రియో వ్యాఖ్యలను తొలగించిన ఓం బిర్లా
- ఏ ఒక్క సభ్యుడినీ దూషించే హక్కు మంత్రికి లేదన్న స్పీకర్
మరోవైపు, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురిపై కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఏ ఒక్క సభ్యుడినీ దూషించే హక్కు మంత్రికి లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్లమెంటరీ పద్ధతుల గురించి సుప్రియోకు అర్థమయ్యేలా చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి స్పీకర్ సూచించారు. ప్రధాని ప్రసంగం నుంచి పదాన్ని పార్లమెంటు రికార్డుల నుంచి తొలగించడం చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంటుంది.