ఢిల్లీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా ఎస్ఐని కాల్చిచంపిన యువకుడు!
- ఢిల్లీలోని పట్‌పడ్‌గంజ్ పారిశ్రామికవాడలో ఘటన
- మూడు రౌండ్ల కాల్పులు జరిపిన యువకుడు
- ఎన్నికల వేళ కలకలం రేపిన హత్య
తీవ్రంగా గాయపడిన ప్రీతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం వేట ప్రారంభించారు.
కాగా, ఎస్ఐ అహల్వాత్ ప్రస్తుతం ఓ అత్యాచారం కేసును దర్యాప్తు చేస్తోందనీ, కేసులో నిందితుడు ఆమెను ఇప్పటికే బెదిరించాడని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ హత్య జరగడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.