Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో 'సామాజిక' ఉద్యమంగా రూపుదాల్చుతున్న వైద్యుడి మృతి ఘటన

  • కొన్నివారాల కిందటే వైరస్ మహమ్మారిని గుర్తించిన చైనా డాక్టర్
  • సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నిర్బంధించిన పోలీసులు
  • కరోనా బారినపడి మృతిచెందిన వైద్యుడు
  • చైనా యువత ఆగ్రహం
సార్స్ వంటి మహమ్మారి విజృంభించబోతోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కరోనా వైరస్ పై మొట్టమొదట స్పందించిన చైనా కంటి వైద్యుడు లీ వెన్ లియాంగ్ తానే కరోనాకు బలైన సంగతి తెలిసిందే. అయితే, డాక్టర్ వెన్ లియాంగ్ ఈ వైరస్ గురించి ఎవరికీ తెలియని సమయంలోనే సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించి ఆయన్ను నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇప్పుడాయన మృతితో చైనాలో ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ఓ సంక్షోభాన్ని ఎదుర్కొనే విధానం ఇదేనా అంటూ చైనీయులు అక్కడి వామపక్ష ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకునేలా మరింత స్వేచ్ఛ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, డాక్టర్ లీ వెన్ లియాంగ్ ను సోషల్ మీడియాలో ఓ హీరోలా కీర్తిస్తున్నారు. మరింత వాక్ స్వాతంత్ర్యం కావాలంటూ సామాజిక మాధ్యమాలను అక్కడి యువత హోరెత్తిస్తోంది. నిఘాలు, నిబంధనలతో కూడిన ఇది కూడా స్వేచ్ఛ అనిపించుకుంటుందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
China
Corona Virus
Dr Li Wenliang
Youth
Social Media

More Telugu News