Corona Virus: రాష్ట్రంలో కరోనా బాధితులు ఎవరూ లేరు: ట్విట్టర్‌లో తెలిపిన మంత్రి ఈటెల

  • పరీక్షలు జరిపిన వారందరికీ నెగెటివ్‌ వచ్చింది
  • కరోనా వార్తలపై మీడియా సంయమనం పాటించాలి
  • హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో పలువురు కరోనా వైరస్‌ బారిన పడినట్లు అనుమానాలు రేకెత్తినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా బాధితులు లేరని ఆ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటి వరకు పరీక్షలు జరిపిన వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్లు వివరించారు.

సున్నితమైన అంశం కాబట్టి, కరోనా బాధితుల విషయంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పూర్తి సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల విషయంలో చోటు చేసుకుంటున్న ఆలస్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. సోమవారం నుంచి గాంధీ ఆసుపత్రిలోనే అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Corona Virus
Etela Rajender
no possitive cases

More Telugu News