Guntur District: గుంటూరులో స్వరూపానంద స్వామికి చేదు అనుభవం.. నిలదీసిన తెలుగు మహిళా కార్యకర్తలు

  • గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చిన స్వామి
  • వాహనానికి అడ్డుపడిన మహిళలు
  • అమరావతి కోసం యాగం చేయాలని డిమాండ్  
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనలు 52వ రోజు కొనసాగుతున్నాయి. మందడం, తుళ్లూరు వెలగపూడి, ఐనవోలు, నవులూరుతో పాటు పలు ప్రాంతాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో స్వరూపానంద స్వామికి చేదు అనుభవం ఎదురైంది. గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు వచ్చిన ఆయనకు  అమరావతిలో నిరసన సెగ  తగిలింది.

స్వామి స్వరూపానంద వచ్చిన వాహనానికి అడ్డు వెళ్లిన తెలుగు మహిళా కార్యకర్తలు ఆయనపై మండిపడ్డారు. గతంలో యాగాలు చేసి జగన్‌ను గెలిపించారని, ఇప్పుడు అమరావతిలో రాజధానిని కొనసాగించేలా యాగం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో అమరావతి కోసం స్వరూపానంద పూజలు చేశారని, మరిప్పుడెందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు.
Guntur District
Amaravati
Telugudesam

More Telugu News