Galla Jayadev: వైసీపీ ఫేస్‌బుక్‌ పేజీ పోల్‌లో అమరావతికి జైకొట్టిన ప్రజలు.. స్క్రీన్ షాట్‌ పోస్ట్ చేసిన ఎంపీ గల్లా జయదేవ్

  • వైసీపీ ఫోరం తమ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ పోల్‌ నిర్వహించింది
  • రాజధానిగా అమరావతి బాగుంటుందా? లేక విశాఖ పట్నమా? అడిగింది
  • మొత్తం 1.13 లక్షల ఓట్లు
  • అమరావతికి 77 శాతం ఓట్లు  
వైసీపీ ఫోరం ఫేస్‌బుక్ పేజ్‌లో 'ఏపీకి రాజధానిగా ఏ నగరం ఉండాలని' పోల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతికి 77 శాతం మంది, విశాఖపట్నానికి 23 శాతం మంది ఓట్లు వేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ స్క్రీన్‌షాట్‌ను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ట్విట్టర్‌ ఖాతాలో  పోస్ట్ చేసి వైసీపీకి చురకలంటించారు.

'వైసీపీ ఫోరం తమ ఫేస్‌బుక్ పేజ్‌లో ఓ పోల్‌ నిర్వహించింది. రాజధానిగా అమరావతి బాగుంటుందా? లేక విశాఖపట్నమా? అన్న విషయాలను తెలపాలని కోరింది. మొత్తం 1.13 లక్షల ఓట్లు వస్తే అమరావతికి 77 శాతం ఓట్లు, విశాఖకు 23 శాతం ఓట్లు వచ్చాయి' అని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.
Galla Jayadev
Telugudesam
YSRCP
Facebook

More Telugu News