Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమించి పెళ్లాడిన భార్యనే కాల్ గర్ల్ ను చేశాడు!

  • నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం
  • విటులను ఇంటికే పిలిపించిన భర్త
  • ఏడాది పాటు నరకం
  • అరెస్ట్ చేసిన అంబర్ పేట పోలీసులు
ప్రేమించానని వెంటపడ్డాడు. పెళ్లాడకుంటే చనిపోతానని బెదిరించి, వివాహం చేసుకున్నాడు. ఆపై కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురి చేయడంతో పాటు, ఆమెను కాల్ గర్ల్ గా చిత్రీకరించి, ఆన్ లైన్ లో విటులను రప్పించి వ్యభిచారం చేయించాడు. అతన్ని హైదరాబాద్, అంబర్ పేట పోలీసులు నిన్న అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కు పంపారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఛత్రినాక పరిధిలో ఉంటున్న ఓ యువతికి నాలుగు సంవత్సరాల క్రితం ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమిస్తున్నానని వెంటపడి, బెంగళూరుకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆపై ఇద్దరూ అంబర్ పేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. ఏ ఉద్యోగమూ లేని అతను, నిత్యమూ మందు కొట్టి వచ్చి హింసించేవాడు. తన బంధువులు, స్నేహితుల భార్యల ఫొటోలను, తన భార్య ఫొటోలను కాల్ గర్ల్స్ గా పరిచయం చేస్తూ, పోస్టులు పెట్టేవాడు.

ఎవరైనా విటులు స్పందిస్తే, వారి నుంచి తన బ్యాంకు ఖాతాలో డబ్బులు వేయించుకునేవాడు. ఆపై వారిని తన స్నేహితులంటూ ఇంటికి తీసుకుని వచ్చి, వారికి మద్యం తాగించి, భార్యతోనూ మద్యం తాగించి, తాను బయటకు వెళ్లిపోయేవాడు. ఆపై ఆమె నరకాన్ని అనుభవించేది. ఇలా దాదాపు ఏడాది గడిచిన తరువాత, కొందరు విటులు అతనితో గొడవకు దిగడం మొదలు పెట్టడంతో, ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

బాధితురాలు అప్పటికే పోలీసులను ఆశ్రయించింది. అయితే, తరచూ ఫోన్ నంబర్లు మారుస్తూ, తాను ఎక్కడ తిరుగుతున్నదీ అతను రహస్యంగా ఉంచడంతో, పోలీసులకు చిక్కలేదు. ఎట్టకేలకు అతని ఆచూకీని కనిపెట్టిన అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Rape
Social Media
Wife
Love Marriage
Police
Arrest

More Telugu News