ఢిల్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, ఆప్‌లపై ఈడీ బాంబు!
- పీఎఫ్ఐతో కాంగ్రెస్, ఆప్ నాయకులకు సంబంధాలు
- పీఎఫ్ఐ ఖాతాల్లో రూ. 120 కోట్లు జమ
- పీఎఫ్ఐ చీఫ్‌తో ఆప్ నేత సంజయ్‌సింగ్ సంప్రదింపులు
పీఎఫ్ఐ, రెహాబ్ ఇండియా ఫౌండేషన్‌కు సంబంధించి 15 బ్యాంకుల్లో ఉన్న 73 ఖాతాల్లో రూ.120 కోట్లు జమ అయినట్టు హోంశాఖకు సమర్పించిన దరఖాస్తులో ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, ఉదిత్ రాజ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులతో పీఎఫ్ఐ ఢిల్లీ అధ్యక్షుడు పర్వేజ్ అహ్మద్ సంప్రదింపులు జరిపారని ఈడీ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.