'డియర్ కామ్రేడ్' హిందీ వెర్షన్ .. 2 వారాల్లో 6 కోట్లకి పైగా వ్యూస్
- తెలుగులో ఆదరణ పొందని 'డియర్ కామ్రేడ్'
- విజయ్ దేవరకొండకి తగ్గని క్రేజ్
- ఇతర భాషా ప్రాంతాల్లోను అభిమానులు
2 వారాల్లోనే ఈ సినిమా 6 కోట్లకి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. 'అర్జున్ రెడ్డి' సినిమా నుంచే విజయ్ దేవరకొండకి ఇతర భాషల్లోను అభిమానులు పెరుగుతూ వస్తున్నారు.'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో రీమేక్ చేసే సమయంలోను ఒరిజినల్ చూసి, విజయ్ దేవరకొండకి అభిమానులుగా మారిపోయారు. ఈ కారణంగానే తెలుగులో అంతగా సక్సెస్ ను సాధించని 'డియర్ కామ్రేడ్' .. హిందీ డబ్బింగ్ వెర్షన్లో యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.