అండర్-19 వరల్డ్ కప్ సెమీస్: చెలరేగిన భారత బౌలర్లు.... కుప్పకూలిన పాక్

  • పోచెఫ్ స్ట్రూమ్ లో దాయాదుల మధ్య కీలక సమరం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • నిప్పులు చెరిగిన కార్తీక్ త్యాగి, సుశాంత్ మిశ్రా
  • బంతిని సుడులు తిప్పిన రవి బిష్ణోయి
  • చేతులెత్తేసిన పాక్ బ్యాట్స్ మెన్
దక్షిణాఫ్రికాలోని పోచెఫ్ స్ట్రూమ్ లో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరంలో భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 172 పరుగులకే కుప్పకూలింది. ఈ కీలక మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే టీమిండియా బౌలర్లు సుశాంత్ మిశ్రా (3), కార్తీక్ త్యాగి (2), రవి బిష్ణోయి (2), అధర్వ అంకోలేకర్ (1), యశస్వి జైస్వాల్ (1) అద్భుతంగా బౌలింగ్ చేసి దాయాది పనిబట్టారు. పాక్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ హైదర్ అలీ (56), కెప్టెన్ రోహైల్ నజీర్ (62), మహ్మద్ హరీస్ (21) మినహా మరెవ్వరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు.
Go Back to Shorts
Under-19 Worldcup
India
Pakistan
South Africa

More Telugu News