'బడ్జెట్ రోజున మార్కెట్ల పతనం ఎందుకు?'... అవాక్కయ్యేలా సమాధానం ఇచ్చిన నిర్మలమ్మ!
- శనివారం నాడు దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- ఇన్వెస్టర్లు వీకెండ్ మూడ్ లో ఉన్నారంతే
- సోమవారం లాభాలను గుర్తు చేసిన నిర్మలా సీతారామన్
ఇక తాజాగా, నిర్మలా సీతారామన్, ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని, ఆపై మీడియాతో మాట్లాడిన వేళ, మార్కెట్ భారీ పతనానికి కారణం ఏంటన్న ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనిపై స్పందించిన నిర్మలమ్మ, అందరూ అవాక్కయ్యే సమాధానం ఇచ్చారు. కేవలం వారాంతం కావడంతోనే మార్కెట్లు నష్టపోయాయని ఆమె అన్నారు.
బడ్జెట్ రోజున మార్కెట్ వర్గాలు సంతోషంగా లేకపోవడానికి కారణం వీకెండ్ మాత్రమేనని, సోమవారం నాడు మార్కెట్లు లాభాల్లో నడిచాయని ఆమె గుర్తు చేయడం గమనార్హం. వీకెండ్ మూడ్ లో ఉన్న మదుపరులు తమ వాటాలను అమ్ముకున్నారని, ఇప్పుడు వారంతా నిజమైన ట్రేడింగ్ మూడ్ లో ఉన్నారని నిర్మలమ్మ వ్యాఖ్యానించారు.