'జాను' ప్రీ రిలీజ్ వేడుకకి వేదిక ఖరారు

  • తమిళ .. కన్నడ భాషల్లో ఆకట్టుకున్న కథ 
  •  'జాను'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు
  • కీలకమైన పాత్రలో వెన్నెల కిషోర్
శర్వానంద్ .. సమంత జంటగా 'జాను' సినిమా రూపొందింది. తమిళంలో విజయాన్ని సాధించిన '96' సినిమాకి ఇది రీమేక్. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమారే తెలుగు సినిమాకి దర్శకత్వం వహించాడు. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమవుతోంది.

రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. వైజాగ్ - ఎ.యు. సిరిపురంలోని 'సర్ సి ఆర్ రెడ్డి కన్వెన్షన్ హాల్' ఇందుకు వేదికగా మారనుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. అటు సమంత .. ఇటు శర్వానంద్ ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో వున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. తమిళ .. కన్నడ భాషా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కథ, తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.
Go Back to Shorts
Sharwanand
Samantha
Prem Kumar
Jaanu Movie

More Telugu News