'నారప్ప' కోసం రంగంలోకి అమలా పాల్
- తమిళనాడులో 'నారప్ప' షూటింగ్
- పీటర్ హెయిన్స్ తో యాక్షన్ సీన్స్
- వేసవిలో ప్రేక్షకుల ముందుకు
పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియమణి కనిపించనుంది. ఓ కీలకమైన పాత్ర కోసం అమలా పాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారు కావొచ్చని చెబుతున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.