బ్రహ్మానందానికి విజిటింగ్ ప్రొఫెసర్ అవకాశం ఆఫర్ చేసిన ఏయూ వీసీ

  • విశాఖలో బ్రహ్మానందానికి ఘన సన్మానం
  • బ్రహ్మీని సత్కరించిన రైటర్స్ అసోసియేషన్
  • ఏయూ థియేటర్ ఆర్ట్స్ విభాగంలో బ్రహ్మీ సేవలందించాలన్న వీసీ
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కెరీర్ లో 35 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విశాఖలో ఆయనకు ఘనంగా సన్మానం జరిగిన సంగతి తెలిసిందే. విశాఖ రైటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మానంలో భాగంగా బ్రహ్మానందానికి వెండి కిరీటం పెట్టి, 35 స్వర్ణ పుష్పాలతో అభిషేకం చేశారు. హాస్య దిగ్గజానికి స్వర్ణ కంకణం తొడిగారు. 35 సంఘాల ప్రతినిధులు పూలమాలలతో సత్కరించారు. బ్రహ్మీ 35 ఏళ్ల సినీ జీవిత విశేషాలతో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి కమెడియన్ బ్రహ్మానందానికి అద్భుతమైన అవకాశం ఆఫర్ చేశారు. ఏయూ విజిటింగ్ ప్రొఫెసర్ గా బ్రహ్మానందానికి ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ఏయూ థియేటర్ ఆర్ట్స్ విభాగంలో సేవలు అందించాలని కోరుతున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Brahmanandam
Felicitation
Vizag
AU
Visiting Prof

More Telugu News