మరిన్ని దేశాలపై అమెరికా నిషేధం... సంతకం చేసిన ట్రంప్!
- భద్రతా నిబంధనలు పాటించడంలో విఫలం
- వలసదారులకు వీసాలు ఇవ్వరాదని నిర్ణయం
- టూరిస్టులు, వ్యాపారులకు వర్తించబోవని స్పష్టం
వీటికి అదనంగా మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాలు ఇవ్వరాదని నిర్ణయించింది. సూడాన్, టాంజానియా దేశాల పౌరులు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు వైట్ హౌస్ సమాచార శాఖ కార్యదర్శి స్టెఫానియా గ్రెషమ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ఆంక్షలు టూరిస్టులు, వ్యాపారులు, వలసేతర ప్రయాణికులకు వర్తించబోవని స్పష్టం చేశారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ తెలిపారు.