అద్భుతమైన బడ్జెట్ అన్న కన్నా... ఏపీని ముంచారన్న సీపీఐ రామకృష్ణ!
- బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- బీజేపీ నేతల పొగడ్తలు
- విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు
ఇక, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీని కేంద్రం మరోసారి మోసం చేసిందని విమర్శించారు. అంకెల గారడీ తప్ప బడ్జెట్ లో ఏమీ లేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా ఈ బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు ప్రస్తావనే తీసుకురాలేదని పేర్కొన్నారు.