ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ.. బీజేపీ నేతల హామీలు
- ‘ఢిల్లీ సంకల్ప పత్ర’ పేర మేనిఫెస్టో విడుదల
- పేదలకు రూ.2కే కిలో గోధుమ పిండి
- కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు
కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు, పాఠశాల పిల్లలకు సైకిల్స్ పంపిణి చేస్తామని తివారీ చెప్పారు. పేదలు గోధుమలు కూడా కొనుక్కోలేకపోతున్నారని, తాము అధికారంలోకి రాగానే వారికి రెండు రూపాయలకే కిలో గోధుమ పిండిని సరఫరా చేస్తామన్నారు. ప్రతీ ఇంటికీ రక్షిత మంచినీటిని అందిస్తామన్నారు. ఢిల్లీలో బుల్లెట్ రైలును ప్రవేశపెడతామని మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ భవిష్యత్తును మార్చి వేస్తామని హామీ ఇచ్చారు.