టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

  • న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా
  • ఇప్పటికే 3-0తో కప్ భారత్ సొంతం
  • పలు మార్పులతో బరిలోకి దిగిన భారత్
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇటీవల జరిగిన మూడు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే కప్ భారత్ సొంతమైంది.

నేటి మ్యాచ్ లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగింది. భారత జట్టులో సంజు సామ్సన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దుబే, సుందర్, ఠాకూర్, చాహల్, సైనీ, బుమ్రా ఉన్నారు. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తోంది.
Go Back to Shorts
India
Crime News
Team New Zealand

More Telugu News