డ్రగ్స్, ఖనిజాల స్మగ్లింగ్ కోసం భూగర్భ మార్గం... రైలు ట్రాక్ కూడా ఏర్పాటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రగ్స్, ఖనిజాల స్మగ్లింగ్ కోసం భూగర్భ మార్గం... రైలు ట్రాక్ కూడా ఏర్పాటు!

  • మెక్సికోలో స్మగ్లర్ల తెగింపు ఇది
  • 5.5 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పుతో కిలోమీటరు పొడవున నిర్మాణం 
  • భూ ఉపరితలానికి 21 మీటర్ల లోతున ఏర్పాటు

ఉపరితలంపై నిషేధిత సరుకులను పోలీసుల కళ్లుగప్పి అక్రమంగా రవాణా చేయడం అన్ని వేళలా సాధ్యం కాదు. అదే భూగర్భంలో నుంచి అయితే ఎవరికీ తెలియదు అన్న ఉద్దేశంతో మెక్సికోలోని స్మగ్లర్లు భలే ఆలోచన చేశారు. భూమికి 21 మీటర్ల లోతున ఏకంగా ఓ సొరంగ మార్గమే ఏర్పాటుచేసి అవసరమైన రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు. గత కొన్నాళ్లుగా ఈ మార్గంలో డ్రగ్స్, ఇతర విలువైన ఖనిజాల రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. వీరి అక్రమ వ్యవహారాన్ని అక్కడి పోలీసులు ఎట్టకేలకు పసిగట్టి బ్రేక్ వేశారు.

అయితే స్మగ్లర్ల తెలివి తేటలు చూసి నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే... మెక్సికోలో తిజౌనా నుంచి శాండియాగో వరకు దాదాపు కిలోమీటరు పొడవున భూగర్భంలో ఉన్న ఓ రవాణా మార్గాన్ని అక్కడి భద్రతా సిబ్బంది కనుగొన్నారు. సొరంగంలో సరుకుల రవాణాకు వీలుగా రైలుమార్గం, విద్యుత్ సదుపాయం , ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు చేశారు.

తొలుత ఇదేదో సైన్యం తమ అవసరాల కోసం నిర్మించిందని అనుకున్నారు. అయితే, స్మగ్లర్లు తమ అక్రమ రవాణా కోసం నిర్మించిందని తర్వాత తేలడంతో అధికారులు కళ్లు తేలేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం గుట్టుమట్లపై ఆరాతీస్తున్నారు.

mexico
underground tunnel
smugglars

More Telugu News