'మేల్ ఎస్కార్ట్'గా రోజుకు రూ. 15 వేల సంపాదన అంటూ... 1200 మందికి బురిడీ!
- లొకాంటోలో మేల్ ఎస్కార్ట్ ప్రకటనలు
- ఆశపడ్డ వారిని అడ్డంగా ముంచేసే దుర్గా ప్రసాద్
- కేసు నమోదు చేసిన పోలీసులు
వాటిని చూసి, ఎవరైనా సంప్రదిస్తే, అందమైన అమ్మాయిల చిత్రాలను వారికి పంపించేవాడు. వారికి మేల్ ఎస్కార్ట్ అవసరమని, అయితే, వారి వద్దకు పంపేముందు తనకు రూ. 1000 చెల్లించాలని షరతు పెట్టేవాడు. ఆశపడ్డ యువకులు అతను చెప్పిన మొత్తాన్ని చెల్లించిన తరువాత వారి నంబర్ బ్లాక్ లిస్టులో చేర్చేవాడు. తాము మోసపోయామని గ్రహించినా, చెల్లించింది కొద్ది మొత్తమే కాబట్టి, పోలీసులను ఆశ్రయించేందుకు వందలాది మంది వెనుకాడారు. ఇదే అదనుగా దుర్గా ప్రసాద్ మరింత మందిని మోసం చేశాడు. తమకు జరిగిన మోసంపై కొందరు కేసు పెట్టగా, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.